Tuesday, September 10, 2013

Telugu Movie Song : Kokilamma : Pallavimchavaa


పల్లవి:
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో 
ప్రణయ సుధా రాధా..
నా బ్రతుకు నీది కాదా..

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

చరణం:
నేనున్నది నీలోనే
ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడో మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

నేనున్నది నీలోనే
ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడో మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమని...ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమని...ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది...గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది...గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

చరణం:
నీ ప్రేమకు కలశాన్ని
నీ పూజకి నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధనా
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

నీ ప్రేమకు కలశాన్ని
నీ పూజకి నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధనా
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని...ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని...ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది...గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది...గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా..
నా బ్రతుకు నీది కాదా..

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

చిత్రం: కోకిలమ్మ