Thursday, September 19, 2013

Telugu Movie Song : Premalekha : Priyaa Ninu Choodaleka



పల్లవి:
ప్రియా నిను చూడలేక 
ఊహలో నీ రూపు రాక 
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
నీ తలపుతోనే నే బతుకుతున్నా

ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాక

చరణం:
వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీ కథలే
కనులకు నిదురలే కరువాయే

ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాక

చరణం:
కోవెలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దైనా అందించరాదా
నినుకాక లేఖలనే పెదవంటుకోదా
వలపులు నీ దరి చేరుటెలా
మోహన పడవలే చేర్చునులే

ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాక
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
నీ తలపుతోనే నే బతుకుతున్నా
ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాక

చిత్రం: ప్రేమలేఖ
సాహిత్యం: భువనచంద్ర
సంగీతం: దేవా
గానం: ఎస్.పి.బాలు,అనురాధ శ్రీరామ్

♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥