Thursday, March 21, 2013

Telugu Movie Song : Prema Lekha : Nee Pilupe

పల్లవి:
నీ పిలుపే ప్రేమ గీతం 
నీ పలుకే ప్రేమ వేదం
ఆశలే బాసలై 
కలలుగనే పసి మనసులై
కవితలు పాడీ...కవ్వించనీ కవ్వించనీ కవ్వించనీ .. ♥ ♥ ♥ 

చరణం:
కళ్ళూ కళ్ళూ మూసుకున్నా
హృదయంతో మాటాడునమ్మా ప్రేమ ..
నిద్దుర చెదిరిపోయేనమ్మా
నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమ ..
అడించి పాడించి అనురాగం కురిపించి
అలరించేదే ప్రేమ ..
రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ
కవ్వించేదే ప్రేమ ..
ప్రేమలకు హద్దు లేదులే
దాన్ని ఎవ్వరైనా ఆపలేరులే .. ♥ ♥ ♥

నీ పిలుపే ప్రేమ గీతం

చరణం:
జాతి లేదు మతమూ లేదు
కట్నాలేవీ కోరుకోదు ప్రేమ ..
ఆది లేదు అంతం లేదు
లోకం అంతా తానై ఉండును ప్రేమ ..
ఊరేదో పేరేదో కన్నోళ్ళా ఊసేదో
అడగదు నిన్ను ప్రేమ ..
నాలోన నీవుండి నీలోనా నేనుండి
జీవించేదే ప్రేమ ..
జాతకాలు చూడబోదులే
ఎన్ని జన్మలైన వీడిపోదులే .. ♥ ♥ ♥

నీ పిలుపే ప్రేమ గీతం
నీ పలుకే ప్రేమ వేదం
ఆశలే బాసలై
కలలుగనే పసి మనసులై
కవితలు పాడీ..కవ్వించనీ కవ్వించనీ కవ్వించనీ .. ♥ ♥ ♥

చిత్రం: ప్రేమలేఖ
సాహిత్యం: భువనచంద్ర
సంగీతం: దేవా
గానం: ఉన్ని కృష్ణన్, చిత్ర

♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ $ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥