Tuesday, March 26, 2013

Telugu Song : Neekosam

పల్లవి:

నీకోసం... నీకోసం.... నీకోసం... నీకోసం.. ♥ ♥
ఎపుడూ లేని ఆలోచనలు 
ఇపుడే కలిగెను ఎందుకు నాలో       నీకోసం.. నీకోసం..
ఈ లోకమిలా ఏదో కలలా
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది.. ♥ ♥

నీకోసం... నీకోసం... నీకోసం... నీకోసం.. ♥ ♥

చరణం:


నాలో ఈ ఇది .. ఏరోజు లేనిది..
ఎదో అలజడి .. నీతోనే మొదలిది..
నువ్వే నాకని పుట్టుంటావని..
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా.. ♥ ♥

నీకోసం... నీకోసం.... నీకోసం... నీకోసం.. ♥ ♥

చరణం:

నాలో ప్రేమకి .. ఒక వింతే ప్రతి ఇది
వీణే పలుకని స్వరమే .. నీ గొంతుది..
మెరిసే నవ్వది .. మోనాలీసది..
ఈ నిజం ఇక కాదనే ఏ మాటలు నే నమ్మనూ.. ♥ ♥

ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం.. నీకోసం..
ఈ లోకమిలా ఏదో కలలా
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది.. ♥ ♥

నీకోసం ...నీకోసం.. నీకోసం ..నీకోసం.. ♥ ♥

చిత్రం: నీకోసం
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: R.P.పట్నాయక్
గానం: రాజేష్, కౌసల్య

♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥