Monday, June 23, 2014

Telugu Movie Song : Roja : Naa Cheli Rojaave


పల్లవి :
నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే … కన్నీట నీవే
కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో… అందించవో..తోడు

చరణం :
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే,చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంట
నీవు లేకపోతే బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు

చరణం :
చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో
మమత దూరమాయెనే చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు
చిత్రం : రోజా
సాహిత్యం : రాజశ్రీ
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
గానం: ఎస్. పి . బాల సుబ్రహ్మణ్యం , సుజాత

♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥