రావణాసుర వైరి
రణపుంగవం రామం॥
దేవదేవం భజే దివ్య ప్రభావం
వేల సుమ గంధముల గాలి అలలా
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల హృదయాల తడిమేటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడు
అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణ ఋణబంధముల తరువును
పుడమిగ నిలుపుటె తన గుణం॥
దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి
రణపుంగవం రామం॥
దేవదేవం భజే దివ్య ప్రభావం
చిత్రం : అత్తారింటికి దారేది
సాహిత్యం : రామజోగయ్య
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : శ్రీరామ్ , రీటా