నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది,
ఇంత భారంగా ఇన్నాళ్ళు లేకుండేది,
నువ్వేమో నాకనీ, నేనేమో నీకనీ
రాశాడా రాతనీ, చేతుల్లో ఈ గీతనీ....
చరణం:
నువ్వే రాకుండా ఇంత దూరం నడిచానా అంటే
ఏంటో చిత్రంగా వుందే నాలో నాకే
నువ్వే లేకుండా ఇంత కాలం బతికానా అంటే
ఏమో కలనైనా నమ్మే వీలే లేదే
ఎన్నడు ఎరుగని నవ్వులని, కన్నులు చేరని వెన్నెలని
అందించావని ఆనందిస్తా నీ తోడులో ...
చీకటి దాచిన వేకువని మనసుకి తెలియని వేడుకని
నువ్వొచ్చాకనే చూస్తున్న కదా నీ ప్రేమలో ...
చరణం:
ఏదో తింటున్నానంతే, ఏదో ఉంటున్నానంతే
నువ్వే ఎదురవ్వకపోతే రోజూ ఇంతే
నాకే నే బరువైపోయా నాలో నే కరువైపోయా
నిన్నే కలిసుండకపోతే చావాలంతే
గాల్లో రాతలు రాసుకుని, నాలో నే మాటాడుకొని
గడిపేశానని గురుతే రాదిక నీ నీడలా
నాకే తోడు దొరకదనీ, ఒంటరితనమే నేస్తమని
అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో..
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్ళు లేకుండేది
నువ్వేమో నాకనీ, నేనేమో నీకనీ
రాశాడా రాతనీ, చేతుల్లో ఈ గీతనీ..
చిత్రం : దేవుడు చేసిన మనుషులు
సంగీతం: : రఘు కుంచె
గానం: శ్రేయ
రచన: భాస్కర