Monday, December 9, 2013

Telugu Movie Song : Happy Days : Oh My Friend

పల్లవి:
పాదమెటు పోతున్నా.. పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా.. తోడు రానా
చిన్ని ఎడబాటైనా .. కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోనా .. నేను లేనా
ఒంటైరెనా ఓటమైనా .. వెంటనడిచే నీడవేగా

Ooh my friend .. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
Ooh my friend .. ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

చరణం:
అమ్మ ఒడిలో లేని పాశం .. నేస్తమల్లే అల్లుకుందీ
జన్మకంతా తీరిపోనీ .. మమతలెన్నో పంచుతోందీ
మీరు మీరు నుంచీ .. మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకీ మారే
మోమాటాలే లేనీ కళే జాలువారే !
ఒంటైరెనా ఓటమైనా.. వెంటనడిచే నీడ నీవే

Ooh my friend .. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
Ooh my friend .. ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

చరణం:
వాన వస్తే కాగితాలే .. పడవలయ్యే జ్ఞాపకాలే
నిన్నుచూస్తే చిన్ననాటీ .. చేతలన్నీ చెంతవాలే
గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకొంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలో తుదలో తెలిపే .. ముడే వీడకుందే
ఒంటైరెనా ఓటమైనా .. వెంటనడిచే నీడ నీవే

Ooh my friend .. తడి కన్నులనే తుడిచిన నేస్తమా
Ooh my friend .. ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

చిత్రం: హ్యాపీ డేస్
సాహిత్యం: వనమాలీ
సంగీతం: మిక్కి జె మేయర్
గానం: కార్తిక్

♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥