Monday, October 14, 2013

Telugu Movie Song : Chakram : Jagamamta Kutumbam



పల్లవి:
జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే...సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది

చరణం:
కవినై, కవితనై...భార్యనై, భర్తనై
కవినై, కవితనై...భార్యనై, భర్తనై
మల్లెల దారిలో.. మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ.. నాతో నేనే భ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటల్ని
రంగుల్ని, రంగవల్లులనీ, కావ్య కన్యల్ని, ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది

చరణం:
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై, శశినై, దివమై, నిశినై
నాతో నేను సహగమస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల, హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది

గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది