Thursday, August 29, 2013

Telugu Movie Song : Samtosham : Nuvvamte Naakishtamani


పల్లవి: 
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా...

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ

చరణం:
నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల నిజమల్లే కనిపించదా
నిన్నిలా చూస్తూ ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగా ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరికా.....

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ

చరణం:
ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారిపోనీయకా
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హయిగా
ఇలా ఉండిపోతే చాలుగా.....

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా


♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥