Thursday, June 6, 2013

Telugu Song : Oh Paapaa Laali : Mate Raani : Telugu Breathless Song

పల్లవి:
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. 
ప్రేమే నాకు పంచే 
జ్ఞాపకాలురా..
రేగే మూగ తలపే వలపు పంటరా..
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా..
రేగే మూగ తలపే..వలపు పంటరా

చరణం:
వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను
చెంతచేరి ఆదమరిచి ప్రేమలు కొసరెను
చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను..
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను..
కన్నె పిల్ల కలలే నాకిక లోకం..
సన్నజాజి కళలే మోహన రాగం..
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే..

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

చరణం:
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు..
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు..
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి..
సంతసాల సిరులే నావే అన్నవి..
ముసి ముసి తలపులు తరగని వలపులు..
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా..
రేగే మూగ తలపే..వలపు పంటరా
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

చిత్రం: ఓ పాపా లాలి
సాహిత్యం: SRV
సంగీతం: ఇళయరాజా
గానం: బాలు

♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥♫♥♥