Wednesday, May 1, 2013

Telugu Song : Nuvve Nuvve : Cheliyaa

చెలియా నీ వైపే వస్తున్నా 
కంటపడవా ఇకనైనా ఎక్కడ ఉన్నా 
నిద్దుర పోతున్న రాతిరినడిగా 
గూటికి చేరిన గువ్వలనడిగా 
చల్లగాలినడిగా 
ఆ చందమామనడిగా 
ప్రియురాలి జాడ చెప్పరేమని
అందరినీ ఇలా వెంటపడి అడగాల
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
చల్లగాలినడిగా
ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని
అందరినీ ఇలా వెంటపడి అడగాల
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

ఓ.. అసలే ఒంటరి తనం అటుపై నిరీక్షణం 2
అరరే పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
నన్నొదిలి నీవుండగలవా నిజం చెప్పవమ్మా
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

నిద్దుర పోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని
ఓ.. నువు నా ప్రాణం అనీ విన్నవించు ఈ పాటనీ 2
ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగానీ
కదిలించలేద కాస్త కూడ నీ మనసునీ
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే
అందరినీ ఇలా వెంటపడి అడగాల
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

నిద్దుర పోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని

చిత్రం : నువ్వే నువ్వే (2003)
సంగీతం : కోటి
రచన : సిరివెన్నెల సీతారామ
గానం : శంకర్ మహదేవన్


♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥