Thursday, April 18, 2013

Telugu Song : Gumdamma Katha : Neevaye

పల్లవి: 
సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే ...
తెల్లని వెన్నెల పానుపుపై ఆ ...ఆ ...
కలలో వింతలు కననాయె ... ♫ ♥ ♫ 

సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసినా కలలాయే 
తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయె
అవి తలచిన ఏమో సిగ్గాయే ..
కనులు తెరచిన నీవాయే
నే కనులు మూసినా నీవాయే
కనులు తెరచిన నీవాయే .. ♫ ♥ ♫

చరణం:
నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే
నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే
కలవరపడి నే కనులు తెరువ నా కంటిపాపలో నీవాయే
ఎచట చూచినా ... నీవాయే

కనులు తెరచిన నీవాయే
నే కనులు మూసినా నీవాయే
కనులు తెరచిన నీవాయే .. ♫ ♥ ♫

చరణం:
మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
ఉలికిపాటుతో కలయవెతక నా హృదయ ఫలకమున నీవాయే

కనులు తెరచిన నీవాయే
కనులు మూసినా నీవేనాయే .. ♫ ♥ ♫

చిత్రం: గుండమ్మ కథ
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
సంగీతం: ఘంటసాల
గానం: పి.సుశీల

♫ ♥ ♫ ♥ ♫ ♥ ♫ ♥ ♫ ♥ ♫ ♥ ♫ ♥ ♫ ♥ ♫ ♥ ♫ ♥ ♫ ♥ ♫