Sunday, November 18, 2012

Telugu Movie Song : Swapna : Ide Naa Modati Prema Lekha


ఇదే నా మొదటి ప్రేమ లేఖ                 
రాశను నీకు చెప్పలేక    ఎదుట పడి మనసు తెలుపలేక            
తెలుపుటకు భాష చేతకాక  2.....!                             2

మెరుపని పిలవాలంటే           ఆ వెలుగు ఒక్క క్షణం.
పువ్వని పిలవాలంటే            ఆ సొగసు ఒక్క దినం.
ఏ రీతిగా నిన్ను          పిలవాలో తెలియదు నాకు  2
తెలిసింది ఒక్కటే          నీవు నా ప్రాణమని       ప్రేమ    ప్రేమ    ప్రేమ    .......!


ఇదే నా మొదటి ప్రేమ లేఖ                 
రాశను నీకు చెప్పలేక         ఎదుట పడి మనసు తెలుపలేక           
 తెలుపుటకు భాష చేతకాక  2.....!

తారవని అందామంటే             నింగిలో మెరిసేవు
ముత్యమని అందామంటే          నీటిలో వెలిసేవు
ఎదలోన కదిలే నిన్ను          దేనితో సరి పోల్చాలో   2  
తెలిసింది ఒక్కటే                  నీవు నా ప్రాణమని       ప్రేమ    ప్రేమ    ప్రేమ    .......!

ఇదే నా మొదటి ప్రేమ లేఖ                 రాశను నీకు చెప్పలేక
ఎదుట పడి మనసు తెలుపలేక            తెలుపుటకు భాష చేతకాక  2.....!